Saturday, October 20

Download Our App Now

Sankalpa’s Special Article: Which Foods to avoid while suffering from Kidney Stones….?

కిడ్నీస్టోన్స్ కలిగి ఉన్న వారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు:

కొన్ని రకాల మినరల్ లు మూత్రాశయంలో చిన్న చిన్న రేణువులుగా లేదా రాళ్లు ఏర్పడతాయి. మీరు మూత్రపిండాల రాళ్ల సమస్యలతో భాదపడుతున్నారా? అయితే మీరు తినే ఆహార పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి సమస్యలను కలిగి ఉండే వారు ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

1.సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు

సోడియంను ఎక్కువగా తీసుకోవటం ద్వారా కాల్షియం మూలకం శరీరం నుండి భయటకు వెళ్ళటం వలన కాల్షియం ఆక్సలేట్ మరియు పాస్పేట్ రాళ్లు ఏర్పడవచ్చు. కాల్షియం ఆక్సలేట్ మరియు పాస్పరస్ తో కలిసి రాళ్లుగా ఏర్పడతాయి. ఫాస్ట్ ఫుడ్, చారు, ప్యాక్ చేయబడిన కూరగాయలు, ఊరగాయ మరియు సంవిధాన పరచిన భోజనాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది.

2.ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు

మూత్రపిండాలలో రాళ్ల సమస్యలతో ఉన్నవారు. ఆక్సలేట్ స్థాయిలు తక్కువగా ఉండేఆహార పదార్థాలను తినండి. ఆక్సలేట్ ను ఎక్కువగా కలిగి ఉండే ఆహార పదార్థాలను తినటం వలన మూత్రంలో ఈ మూలకపు స్థాయిలు అధికమై, రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. పాలకూర, నట్స్, వీట బ్రాన్ మమ్రియు చాక్లెట్ వంటి అధిక ఆక్సలేట్ స్థాయిలను కలిగి ఉన్నవాటికి దూరంగా ఉండండి.

3.విటమిన్ ‘C’ ఆహారాలు

విటమిన్ ‘C’ లేదా ఆస్కార్బిక్ ఆసిడ్ ఉపభాగాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినటం వలన మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది మరియు ఈ పరిస్థితి అధికం అవటానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కావున మిరియాలు, పచ్చని ఆకుకూరలు, జామపండు, బ్రోకలీ మరియు విటమిన్ ‘C’ ని అధికంగా కలిగి ఉండే ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

4.పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు

మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహర పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని వలన హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారి తీయవచ్చు. టమోటా, బంగాళదుంప, పాలకూర, అవకాడో, అరటిపండు, నారింజ మరియు డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని పరిమితి స్థాయిలో తీసుకోవాలి.

5.సోడా

సోడాను ఎక్కువగా తాగటం వలన మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని అధికం చేయటంతో పాటూ, శరీర బరువును కూడా పెంచుతుంది. మూత్రపిండాలలో రాళ్ల సమస్యలతో భాదపడుతూ ఉంటే, వీటికి దూరంగా ఉండాలి. సోడా ఎక్కువగా తాగటం వలన పాస్పరిక్ ఆసిడ్ సంబంధిత రాళ్లు ఏర్పడతాయి. 

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »