Wednesday, February 20

Download Our App Now

Sankalpa’s Special Article: Symptoms of Kidney Stones

మూత్రపిండాలలో రాళ్లు (కిడ్నీ స్టోన్స్ యొక్క హెచ్చరికలు)

 

మూత్రపిండాలలో రాళ్లు చాలా నొప్పిగా మరియు అసౌకర్యాలకు గురి చేస్తాయి, అంతేకాకుండా వీటి ప్రారంభ సంకేతాలను తెలుసుకోవటం వలన ముందుగానే పసిగట్టి చికిత్స చేయించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు ఈ మూత్రపిండాలలో రాళ్లు అంటే ఏమిటి….?

మూత్రపిండాలలో లేదా మూత్ర మూత్ర మార్గంలో మినరల్స్ స్ఫటికాకారంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండాల రాళ్లుగా పేర్కొంటారు. మూత్ర పరిమాణం తగ్గటం లేదా అధిక మొత్తంలో లవణాలు స్పటికాలుగా మారటం వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ వలన మూత్రంలో రక్తం రావటం మరియు ఉదర భాగంలో నొప్పి లేదా వెన్నుభాగంలో నొప్పి కలుగుతుంది.

  1. తరచుగా మూత్రం & నొప్పితో కూడిన మూత్ర విసర్జన: ఉన్నట్టుండి తరచుగా మూత్ర విసర్జన చేయటం అనేది కిడ్నీ స్టోన్స్ యొక్క సంకేతం. ఇలా తరచుగా చేసే మూత్ర విసర్జనతో పాటుగా విసర్జన సమయంలో నొప్పి కానీ కలిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలిసి, మూత్ర పిండాలలో రాళ్లను గుర్తించే పరీక్ష చేయించుకోవాలి. రాళ్లు మూత్ర మార్గం నుండి మూత్రాశయంలోకి ప్రవేశించేపుడు, తరచుగా మూత్ర విసర్జనతో పాటూ నొప్పిని కూడా కలిగిస్తాయి.
  2. వెన్నుభాగంలో నొప్పి: మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయని తెలిపే అత్యంత సాధారణ లక్షణం- వెన్నుభాగంలో నొప్పి. ఈ నొప్పి అకస్మాత్తుగా మరియు చాలా తీవ్రంగా కలుగుతుంది మరియు అపుడపుడు ఉదరభాగంలో నొప్పి కూడా కలగవచ్చు. ఒకవేళ మీరు అకస్మాత్తుగా, వెన్నుభాగంలో లేదా పొట్ట భాగంలో నొప్పికి గురైతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవండి.

౩. మూత్రంలో రక్తం: మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయని తెలిపే మరొక సంకేతం- మూత్రంలో రక్తం. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడిన వారు పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో మూత్ర విసర్జన జరుపుతారు. ఇలా కిడ్నీ స్టోన్స్ అభివృద్ధి చెందటం వలన మూత్రంలో రక్తం విసర్జించబడుతుంది. కావున మూత్రం రంగు మారగానే వైద్యుడిని కలవండి.

  1. కూర్చోవటంలో సమస్యలు:

కొన్నిసార్లు, కిడ్నీ స్టోన్స్ పరిమాణం చాలా పెద్దగా మారతాయి, ఫలితంగా ఆ వ్యక్తి కూర్చోటానికి కూడా ఇబ్బందిగా భావిస్తుంటాడు. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడిన వ్యక్తి కూర్చోటానికి ఇబ్బందిగా భావిస్తూ, నిలబడటానికి మాత్రమే ప్రాముఖ్యత చూపిస్తుంటాడు.

  1. వాపులు:

మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లు వాటి పరిమాణం పెరిగిన కొలది వాపులకు మరియు చాలా నొప్పికి గురవుతుంటాడు. ఉదర భాగంలో లేదా వెన్నుముక కింది భాగంలో వాపు లేదా ఇన్ఫ్లమేషన్ కలిగితే వెంటనే వైద్యుడిని కలవండి.

పై లక్షణాలలో మీరు ఏ ఒక్కటి గమనించినా…. దాదాపుగా “కిడ్నీ స్టోన్స్” సమస్యని ఎదుర్కుంటున్నట్లే. కాబట్టి, వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన టెస్ట్ లు మరియు చికిత్స చేయించుకొనవలెను.

 

  • డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

 

 

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »