Wednesday, February 20

Download Our App Now

Sankalpa’s Special Article: Symptoms of Kidney

మూత్రపిండాలను ప్రమాదానికి గురిచేసే అలవాట్లుఏవి….?

1.సరిపోయేంత మొత్తంలో నీరు తాగకపోవటం

మన మూత్రపిండాల ప్రథమ విధి జీవక్రియలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను బయటకు పంపటం. మూత్రపిండాలు ప్రమాదానికి గురవటానికి మొదటి కారణం-శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు తాగకపోవటం. మీ శరీరాన్ని హైడ్రేటేడ్’గా ఉంచుకోవాలి మరియు శరీరంలో నీటి శాతం తక్కిన స్థాయిలో ఉంచుకోవాలి. 

 

2. మితిమీరిన మోతాదులో సోడియం

మూత్ర పిండాలు సరిగా పని చేయటానికి మరియు జీవక్రియలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకి పంపటానికి కావలసిన మినరల్ ‘సోడియం’. మితిమీరిన స్థాయిలో ఉప్పు (సోడియం అందించే పదార్థం) తీసుకోవటం వలన, మూత్ర పిండాలు నిరంతరం వ్యర్థ పదార్థాల నుండి సోడియాన్ని గ్రహిస్తుంటాయి. మీరు తీసుకునే సోడియం స్థాయిలు అధికం అవటం వలన మూత్ర పిండాలు ఒత్తిడికి గురవుతాయి.

 

3. మూత్ర సంచిని ఎక్కువ సమయం నింపుకొని ఉండటం

మూత్ర సంచిని ఎక్కువ సమయం నిపుకొని ఉండటం చాలా ప్రమాదకరం. దీని వలన పూర్తి విసర్జక వ్యవస్థ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ‘హైడ్రోనియోపోరోసిస్’ (మూత్ర పిండాలలో మూత్ర పీడనం పెరగటం) చాలా ప్రమాదకరం, ఇది మూత్రపిండాల వైకల్యానికి దారి తీస్తుంది. మూత్రం ఆపుకోవటం అనేది కూడా ఒక రకమైన మూత్ర పిండాల ఆరోగ్యాన్ని నష్టపరిచే అలవాటుగా చెప్పుకోవచ్చు.

 

4. నొప్పి ఉపశమన మందులు

నోప్పి ఉపశమన మాత్రలను అధికంగా వాడటం వలన మూత్ర పిండాల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. నొప్పి కొద్దిగా ఉన్నపుడు వీటిని వాడటం వలన శరీరంలో ఉండే వివిధ రకాల అవయవాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. నొప్పి ఉమశమన మాత్రలను అధికంగా తీసుకోవటం వలన రక్తం సరఫరా తగ్గిపోయి, మూత్రపిండాలు ప్రమాదానికి గురిచేసి వాటి విధిని నిర్వీర్యం చేస్తాయని పరీశోధకులు వెల్లడించారు. 

 

5. మద్యపానం

ఆల్కహాల్ తీసుకోవటం వలన మూత్ర పిండాలు ప్రమాదానికి గురవుతాయి, అంతేకాకుండా ఆల్కహాల్’లో ఉండే ప్రమాదకర కారకాలు మూత్రపిండాల పైన ఒత్తిడిని పెంచటమే కాకుండా శరీర భాగాల పైన కూడా ప్రభావాన్ని చూపుతాయి.

 

6. వ్యాయామాలు చేయకపోవటం

మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే, తప్పకుండా కొన్ని రకాల భౌతిక కార్యకపాలను చేయాలి. రోజు వ్యాయామాలను అనుసరించటం వలన రక్త పీడనం పెరుగదు మరియు మధుమేహ వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వాటికి దూరంగా ఉంటారు. 

 

7. ప్రోటీన్ అధికంగా తీసుకోవటం వలన

ప్రోటీన్ శరీరానికి అవసరమే కానీ అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవటం వలన మీ ఆరోగ్యాన్ని చాలా రకాలుగా ప్రమాదానికి గురిచేస్తాయి. ముఖ్యంగా మూత్రపిండాల స్థితిని ప్రమాదానికి గురి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో రెడ్ మీట్ మరియు ఇతర ప్రోటీన్ ఆధారిత ఆహార పదార్థాలను తీసుకోవటం వలన జీవక్రియను పెంచి మూత్రపిండాల పైన భారాన్ని పెంచుతాయి. కావున సరైన మొత్తంలో ప్రోటీన్ సేకరించటం ఆరోగ్యానికి చాలా మంచిది.

 

 

8. కెఫీన్ మరియు సోడా

దాహంగా అనిపించినపుడు, చాలా మంది నీటికి బదులుగా శీతల పానీయాలు లేదా సోడా వంటి ద్రావణాలను త్రాగుతారు. ఈ ద్రావణాలలో చాలా వరకు కెఫీన్’ను కలిగి ఉంటాయి. ఇది శరీర రక్త పీడనం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అధిక మోతాదులో కెఫీన్ తీసుకోవటం వలన మూత్రపిండాల పైన ఒత్తిడి ఏర్పడి వాటిని ప్రమాదానికి గురి చేస్తాయి.

 

9. జలుబు మరియు దగ్గులను లేక్కచేయకపోవటం

జలుబు మరియు దగ్గులను పట్టించుకోకపోవటం వలన శరీరం పైన తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులను ఏర్పరుస్తాయి. ఎవరైతే తరచుగా జ్వరంతో భాదపడుతూ వాటిని పట్టించుకోరో, వారు మూత్రపిండ వ్యాధులతో భాధపడతారు అని వైద్యసంబంధిత పుస్తకాలలో తెలిపారు. చాలా సున్నితత్వంగా ఉండే వారిలో వాతావరణ మార్పులతో పాటూ వారి శరీర మూత్రపిండాలు కూడా అనారోగ్యానికి గురవుతాయి.

 

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »