Friday, April 26

Download Our App Now

Sankalpa’s Special Article: How to stop liquor habit….?

మద్యపానము మానటం ఎలా?

మద్యం చాలారకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ల ముప్పునూ పెంచుతుందని వైద్య నిపుణులు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. కానీ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. చేజేతులా తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుంటున్నామని తెలిసినా మద్యం తాగటం మానటం లేదు.

మద్యంతో క్యాన్సర్లు మాత్రమే కాదు. గుండెజబ్బుల ముప్పూ పెరుగుతుంది. రోజుకు ఒక 45 ఎం.ఎల్‌ మద్యం (40% ఆల్కహాలు గలవి) తాగినా గుండె ఎడమ కర్ణిక సైజు పెరుగుతున్నట్టు, గుండెలయ తప్పే ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందువల్ల మద్యం జోలికి వెళ్లక పోవటం ఉత్తమం.

మద్యానికి బానిసలైనవారు తమని తామే సంరక్షించుకోలేని స్థితిలో ఉంటారు. వారు పిల్లలకు తాము భద్రంగా ఉన్నామన్న ధైర్యాన్ని కల్పించలేరు. పైకి చెప్పలేకపోయినా తండ్రులు తాగుతున్నపుడు వారి పిల్లలు మానసిక వేదనని అనుభవిస్తారు. భయం, అభద్రత, కోపం, నిర్లక్ష్యం లాంటి నెగెటివ్ లక్షణాలు ఈ పిల్లల్లో ఇతర పిల్లల కంటే ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది.

మద్యానికి బానిసలైనవారు చాలా మంది మానేయాలి అనుకుంటారు కాని ఎలా మానాలో తెలియదు. ఖచ్చితంగా త్రాగటం మానేయాలి అనే కోరికను నమ్మకంగా, ఇష్టంగానూ కలిగివుండాలి. ఎవరో చెప్పటం వల్ల కాదు, మన అంతట మనమే మానుకునే ప్రయత్నం చేయాలి. త్రాగటం మానకపోతే తృప్తికరమైన, సమర్దవంతమైన జీవితం అసంభవమని అర్థం చేసుకోవాలి. తెలివిగల, ఆలోచనగల్గిన వ్యక్తి ఎవరైనా ఎప్పుడో కాదు, ఇప్పుడే వెంటనే మానివేయటం ద్వారా ఎన్నో లాభాలున్నాయని గుర్తించాలి. అలసిన, సొలసిన జీవితానికి త్రాగటం కాదు. మంచి ఆహారం ముఖ్యం. అనవసరమైన విసుగుదల, తొందరపాటును విసర్జించాలి. సాధ్యమైనంత వరకు మనస్సును చెదరగొట్టుకోకూడదు. కేవలం మత్తును కలిగించే పదార్థాలు శాంతిని, నెమ్మదిని, విశ్రాంతి నిస్తాయని తలచడం పొరపాటు, మానసిక, శారీరక విశ్రాంతిని సహజంగానే పొందడానికి అలవాటు పడాలి.

మద్యం అధిక మొత్తాల్లో తీసుకునే వారిలో ముందుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు బహిర్గతం కాకుండా నెమ్మదిగా కాలేయం దెబ్బ తింటుంది. ఈ స్థితిని లివర్‌ సిర్రోసిస్‌ అంటారు. ఈ సమస్యలో అధికశాతం వ్యాధి లక్షణాలు చాలా మెల్లగా మొదలవుతాయి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆల్కహాల్‌ ప్రతిరోజూ తీసుకోవడం వలన ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఆకలి లేకపోవడం, పౌష్టికాహార లోపాల వలన మనిషి బరువు తగ్గడం, ముఖ్యంగా కండరాలు క్షీణించడం జరుగుతాయి.

మనిషి ఎక్కువగా నీరసించి అలసిపోవడంతో పాటు చర్మంపై ఎర్రని మచ్చలు వస్తాయి. దానిని ఈజిబ్రుయిజింగ్‌ అంటారు. క్రమంగా రోగిలోని కాలేయ కణాలు సక్రమంగా పని చేయకపోవడం, పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ స్థితిలో జాండిస్‌ తీవ్రత పెరగడం, ఆహార నాళాలనుంచి పెరిగిన ఇసోఫేజియల్‌ వారి సెస్‌నుండి రక్తస్రావం కావడం, పొట్టలో నీరు చేరడం, మెదడు మందగించి ఎన్‌సెఫలోపతి అనే పరిస్థితిలోకి రోగిలోనుకావడం జరుగుతుంది.

మీరు త్రాగుడుకి బానిస అయ్యారనుకుంటే, దానిని నిగ్రహించుకోవడంవలన చాలా లాభాలు ఉన్నాయి; స్ట్రోకులను నివారించడం,బరువు కోల్పోవడం, కాలేయ వ్యాధి వొచ్చే అవకాశం తగ్గించడం వంటివి కొన్నిఆరోగ్యానికి లాభాన్ని చేకూరుస్తాయి. మీరు త్రాగుడు మానేయాలనుకుంటే, ఇక్కడ కొన్ని చిట్కాలు మరియు విధానాలు పొందుపరుస్తున్నాము.

త్రాగుడు మానడం గురించి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. గుర్తుంచుకోండి, మీ ప్రాణస్నేహితుడిని వదిలించుకోమని ఎవరూ మిమ్మలిని బలవంతం చేయటంలేదు. మీ శత్రువునుండి మిమ్మలిని మీరు కాపాడుకోండి. మీరు మీ అభిప్రాయాన్ని సరిచేసుకుంటే త్రాగుడు మానటం సులభం.

ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారు దృఢ విశ్వాసంతో ప్రయత్నిస్తే అసాధ్యమేమి కాదు. రోజంతా మద్యంమత్తులో మునిగి తేలిన వారు ఇప్పుడు మందు అంటే అసహ్యించుకుంటున్నారు. అందుకు వారిలో ఉన్న పట్టుదలే ప్రధాన కారణం. మద్యం సేవించే మిత్రులతో కొంతకాలం దూరంగా ఉండండి. పార్టీలకు స్వస్తి పలకండి. పుస్తకాలు చదవండి. టీవీలో వచ్చే హాస్య సన్నివేశాలు చూసి నవ్వుకోండి. ఒంటరిగా ఉండకుండా పిల్లలతో ఆడుకోండి. ఆలోచనలు మద్యం వైపు మళ్లకుండా బీజీగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకోండి. దీంతో మద్యం తాగాలనే కోరిక నశిస్తుంది. ఇక హాయిగా.. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా డబ్బులూ ఆదా అవుతాయి.

ఉద్యోగంలో పని ఒత్తిడిని అధిగమించడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని ఆచరణలో పెడితే సమస్య పరిష్కారమవుతుంది. ముందుగా కోపాన్ని తగ్గించుకోవాలి. మనసును అదుపులో పెట్టుకోవాలి. ఎంత పెద్ద సమస్యనైనా అధిగమిస్తాననే విశ్వాసంతో ఉండాలి. చిరునవ్వుతో పనులు చక్కబెట్టుకోవాలి. శత్రువులుంటే వారి మాటలను పట్టించుకోవద్దు. ప్రతి రోజు వాకింగ్, వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. బీపీ, షుగర్ ఉంటే వైద్యుల సలహా మేరకు ప్రతి రోజు మందులు వాడాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రశాంతతే ఉంటుంది.

మద్యం మానాలని బలంగా మీరు మీ మనస్సులో అనుకోవాలి. అనుభవజ్ఞులైన డాక్టర్లు అందించే కౌన్సిలింగ్ సెషన్స్ కి అటెండ్ అయినట్లయితే తప్పనిసరిగా మీరు ఈ దుర్వ్యసనాన్ని అంతమొందించుకోవచ్చు. దీనిని వదిలివేయాలి అనుకునేవారికి వైద్య సాంకేతిక పరిజ్ఞానం మరియు సమర్థవంతమైన మానసిక కౌన్సిలింగ్ దోహదం చేస్తున్నాయి.

ఇప్పుడు మన తిరుపతిలోని “సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” లో మద్యపాన వ్యసనాన్ని మాన్పించేందుకు ప్రతిరోజూ కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్యబృందం తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తూ ఈ మద్యమనే రక్కసిని మన సమాజంలోనుంచి తరిమివేయటానికి ప్రయత్నిస్తున్నారు.

“మద్యాన్ని తరిమికొడదాం”

“ఆరోగ్య భారత్ ని నిర్మిద్దాం”.

మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ఈ దురలవాటుతో ఇబ్బందిపడుతున్నట్లైతే దయచేసి ఈ క్రింది అడ్రస్ లో సంప్రదించండి.

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »