Wednesday, March 20

Download Our App Now

Sankalpa’s Special Article :  Know about your “TOOTH”

ప్రతి పన్నుకీ రెండు ముఖ్య భాగాలు ఉంటాయి. కిరీట భాగం మరియు మూల భాగం. పైకి మనకు కనిపించేది కిరీట భాగం. చిగురు లోపల ఉండేది మూల భాగం. ఈ భాగం పంటి పొడవులో 2/3 వంతు ఉంటుంది. పెద్దవాళ్ళలో జ్ఞానదంతాలతో కలిపి 32 పళ్ళు ఉంటాయి.

పళ్ళు నాలుగు రకాల కణజాలాలతో ఏర్పడతాయి.

 1. ఎనామెల్ (దంతిక) – ఇది పంటి మీద కప్పబడిఉన్న తెల్లటి దృఢమైన పదార్ధము. నములుతున్నప్పుడు ఎనామెల్ పంటిని రాపిడి నుండి కాపాడుతుంది.
 2. డెంటిన్ – పంటి పై ఉన్న ఎనామెల్ కు దన్నుగా ఉంటుంది, ఇది పసుపు రంగులో ఉండే ఎముక లాంటి పదార్ధం. ఇది ఎనామెల్ కన్నా కొంచెం మృదువుగా ఉండి నాడీ తంతువులను (నెర్వ్ ఫైబెర్స్) కలిగి ఉంటుంది. ఈ నరాలు పంట్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనకి తెలియచేస్తాయి.
 3. పల్ప్ – పంటి మధ్యలో ఉండే కండ. ఇది చాలా మెత్తగా ఉండి రక్త నాళాలను, శోష రస నాళాలను (లింఫ్ వెసల్స్ ) మరియు నరాలను కలిగి ఉండే కణజాలం. ఈ పల్ప్ నుండే పంటికి పోషణ లభిస్తుంది మరియు మెదడుకి సంకేతాలు వెళతాయి.
 4. సిమెంటం – దంతం యొక్క మూల భాగాన్ని చాలావరకూ కప్పి ఉంటుంది. ఇది పంటిని దవడ ఎముకలతో కలపడానికి తోడ్పడుతుంది. ఈ సిమెంటంకి దవడ ఎముకకి మధ్యన పెరిడోంటల్ లిగమెంట్ ( దాంత్య స్నాయువు) అనే ఒక మెత్త లాంటి పొర ఉండి రెండింటినీ కలుపుతుంది.

నోటి ఆరోగ్యం

నోటి ఆరోగ్యం మరియు దంతాల ఆరోగ్యం అందరికీ చాలా ముఖ్యం. నోటి ఆరోగ్యం వలన అన్ని విధాలా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు. ఈ దిగువన ఇవ్వబడిన సూచనలు మీకు అద్భుతమైన నోటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి:

పళ్ళ చుట్టూ ఉన్న చిగుళ్ళు మీ పళ్ళను కదలకుండా ఉంచడానికి తోడ్పడతాయి. మీ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి నోటి పరిశుభ్రతను పాటించండి. కనీసం రోజుకి రెండు సార్లైనా పళ్ళు తోముకోవాలి. రోజుకి ఒకసారైనా ఫ్లాస్సింగ్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా దంత వైద్యులను సంప్రదించాలి. మీ చిగుళ్ళు వాచి ఎర్రగా మారినా, చిగుళ్ళనుండి రక్తం స్రవిస్తున్నా అవి ఇన్ ఫెక్ష న్ కు గురి కావచ్చు. దీనిని జింజివైటిస్ అంటారు. సత్వర చికిత్స नोटिस నోటి ఆరోగ్యాన్ని పునరుధ్ధరించడానికి సహాయ పడుతుంది. చికిత్స చేయకుండా వదిలివేస్తే మరింత తీవ్రతరమైన చిగుళ్ళ వ్యాధి (పెరియోడాంటిస) గా మారి పళ్ళు కూడా ఊడిపోవచ్చు.


నోటి ఆరోగ్యం పరిశుభ్రమైన దంతాలతో మొదలౌతుంది. పళ్ళు తోముకోడానికి ముఖ్యమైన సూత్రాలు:

దంతాలను కనీసం రోజుకు రెండు సార్లు తోముకోవాలి హడావిడి పడకుండా నిదానంగా పళ్ళను తోముకోవాలి. సరైన టూత్ బ్రష్ ను, టూత్ పేస్టును వాడండి : ఫ్లొరైడ్ టూత్ పేస్టును, మెత్తటి టూత్ బ్రష్ ను వాడండి. సరైన టెక్నిక్ ను ప్రాక్టీస్ చేయండి పళ్ళ మీద బ్రష్ ను కొంచెం ఏటవాలుగా పెట్టుకుని, కొద్ది దూరం ముందుకీ వెనక్కీ కదుపుతూ బ్రష్ చేయాలి. పళ్ళ లోపలి వైపూ, పైనా మరియూ నాలుక మీదా బ్రష్ చేయడం మరచిపోకూడదు. చిగుళ్ళు నొప్పి పుట్టేటట్లు మరీ గట్టిగా బ్రష్ చేయకూడదు. టూత్ బ్రష్ ను మార్చడం  ప్రతి మూడు నాలుగు నెలలకి ఒక కొత్త టూత్ బ్రష్ ను మార్చాలి.

నోటి ఆరోగ్యానికి చిట్కాలు:

 • ఎల్లప్పుడూ మెత్తటి బ్రష్ నే వాడండి
 • ప్రతిసారీ భోజనం చేసిన తరువాత పుక్కిలించండి
 • పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారపు తునకలను తొలగించడానికి ఫ్లాస్సింగ్ చేయాలి
 • నోరు ఎండి పోయినట్లున్నప్పుడు షుగర్ లేని చూయింగ్ గమ్ ను నమిలితే లాలా జలం ఊరుతుంది
 • గట్టిగా ఉండే పప్పులను తింటే లాలా జలం బాగా ఊరుతుంది. నమిలే కండరాలకి వ్యాయామం కలిగిస్తుంది.
 • పసి పిల్లలకు బఠాణీ గింజంత नोटिस టూత్ పేస్ట్ వాడి బ్రషింగ్ తరువాత ఉమ్మేయమనాలి
 • ఎప్పుడూ ఆల్కహాల్ లేని మౌత్ వాష్ నే వాడాలి. ఎందుకంటే ఆల్కహాల్ వలన క్సీరోస్టోమియా (నోరు ఎండిపోవడం) రావచ్చును.
 • నాలుక శుభ్రంగా ఉండడానికి నాలుక బద్దను వాడాలి. సూక్ష్మజీవులతో కూడుకున్న నాలుక వలన హాలిటోసిస్ అనే పరిస్థితి నెలకొనచ్చు. నాలుకను శుభ్రం చేయడానికి టూత్ బ్రష్ ను కూడా వాడవచ్చు. పళ్ళు లేని వారు కట్టుడు పళ్ళను పెట్టించుకోవచ్చు. ఇవి పంటి కిరీట భాగానికి ఊతం ఇస్తాయి. బ్రిడ్జ్ లు పళ్ళ మధ్య ఖాళీలు కనిపించకుండా మంచి పలు వరుస నిస్తాయి.
 • పళ్ళు అరిగిపోయిన వాళ్ళు రకరకాల “ఎన్హాన్స్మెంట్స్” అందాన్ని పెంచేవి)తో ఎంతో మార్పును తెచ్చుకోవచ్చు. ‘క్రౌన్స్’ కృత్రిమ కిరీటాలు) పంటికి మునుపటి ఆకారాన్ని చేకూరుస్తాయి. మరియు `ఇంప్లాంట్స్ తో ఎన్నో విధాలుగా పళ్ళకు మార్పులు చేసుకొన వచ్చు. పొగత్రాగడం నోటి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పొగత్రాగడం పళ్ళ రంగును మార్చడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

పంటి నొప్పికి చిట్కాలు

మనలో చాలా మందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. ఈ నొప్పిని సురక్షితమైన సహజ పధ్ధతులలో నివారించడం గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఆవాలు. మిరియాలు, వెల్లుల్లి వంటివి పంటి నొప్పిని సమర్ధవంతంగా నివారిస్తాయి.

పంటి నొప్పిని నయం చెసే చిట్కాలు :

 • పంటి నొప్పి తగ్గించడానికి లవంగం నూనె మంచిది. లవంగ నూనెలో ఒక చిటికెడు మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న పన్ను మీద పెట్టాలి.
 • పంటి నొప్పినుండి ఉపశమనాన్ని పొందడానికి ఆవ నూనె కూడా వాడవచ్చు. ఒక్క చిటికెడు ఉప్పు కలిపిన ఆవ నూనెను సలుపుతున్న చిగుళ్ళపై మర్దన చెయ్యాలి.
 • నిమ్మరసం కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది.
 • నొప్పిగా ఉన్న చిగుళ్ళ మీద మరియు పంటి మీద అప్పుడే తరిగిన ఉల్లి పాయ ముక్కను పెట్టుకోవడం ద్వారా పంటి నొప్పిని సమర్ధవంతంగా నివారించవచ్చు.
 • పంటి నొప్పిని తగ్గించే కాలెండ్యులా (కాలెండ్యులా అఫిసినాలిస్ ), మిర్ (కొమ్మిఫోరా మిర్రా) మరియు సేజ్ (సాల్వియా అఫిసినాలిస్ ) వంటి మూలికలతో పుక్కిలించడానికి ఇంట్లొనే మౌత్ వాష్ ను తయారు చేసుకోవచ్చు. తులసి, మర్జోరం మరియు మెంతి కూడా ఇందుకు పనికి వస్తాయి.
 • నొప్పిని అదుపులో ఉంచడానికి బుగ్గ మీద ఐస్ క్యూబ్స్ ఉపయోగించవచ్చు.
 • అకస్మాత్తుగా పంటి నొప్పి మొదలైనప్పుడు, చల్లటి, వేడి మరియు తీపి పదార్ధాలు నొప్పిని అధికం చేస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
 • ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. చిరుతిళ్ళు తినరాదు.

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

 

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »