Saturday, October 20

Download Our App Now

Sankalpa’s Special Article about Knee pains

మోకాళ్ళ కీళ్ల సమస్యలు – అవగాహన

మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతాయి.

కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి . పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతాయి.

మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు.

కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయాన్నే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

ఆస్టియో ఆర్థరెైటిస్‌(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

 

చికిత్స:

ఆస్టియో ఆర్థరెైటిస్‌ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

            ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.

            నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.

            పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.

            వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.

 

వ్యాయామం:

                మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.

                స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది.

                ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.

 

ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు.

 

ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

 

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »