Thursday, September 20

Download Our App Now

Sankalpa’s Special Article about hysteria

హిస్టీరియా సమస్య – అవగాహన

 

 హిస్టీరియా మెదడు, నాడీ మండలాలకు సంబంధించిన వ్యాధి. పురుషులలో కంటే స్త్రీలలో ఈ రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ జననేంద్రియ సముదాయం అంటే గర్భా శయంనుంచి అన్ని జననేంద్రియ భాగాలలో అంతర్గతంగా ఉండే నాడీ సంబంధ వ్యాధికారక లక్షణాలతో చాలా వరకూ ముడిపడి ఉండే విపరీత మానసిక లక్షణమిది.

 

శరీర తత్వాన్నిబట్టి మెదడు, నాడీ మండ లంలో ఏర్పడే అధిక నిస్సత్తువల వలన కాని, మానసిక ప్రకోపాల వలన కాని, మానసిక స్థితిలో కలిగే మార్పుల వలన కాని హిస్టీరి యాతో స్త్రీలు బాధపడవచ్చు. దీనికి ఉదాహ రణగా అసలు గర్భాశయం లేకుండా జన్మించిన స్త్రీలలో కూడా ఈ వ్యాధిని గమనించడాన్ని పేర్కొనవచ్చు.

 

హిస్టీరియా స్థితి వివాహం కాని స్త్రీలలో, ఏ ఇతర సమయాలలో కంటే బహిష్టు సమయంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాని వివాహమైన స్త్రీలలో, సుఖ సంతో షాలతో ఉన్న స్త్రీలలో, గర్భిణీలలో, పాలిచ్చే తల్లులలో, బహిష్టులు ఆగిపోయిన స్త్రీలలో కూడా హిస్టీరియా లక్షణాలు ఏర్పడటం సహజమే.

 

కొంతమంది పురుషులు కూడా ఈ వ్యాధి బారినపడటం గమనించారు. హిస్టీరియా బారిన పడిన స్త్రీల ప్రవర్తన వింతగా ఉంటుంది. కళ్లు పెద్దవి చేయడం, అరవటం, గెంతటం మొదలై నవి చేస్తుంటారు.

 

కారణాలు

హిస్టీరియాకు చాలా కారణాలున్నాయి. నరాల నిస్సత్తువ, నరాలకు నాణ్యమైన రక్త ప్రసరణ లేకపోవటం హిస్టీరియాకు కారణాలు.

అలాగే నిద్రలేమి, అవమాన భారం, అధిక లైంగిక వాంఛ, నాడీ మండల అనారోగ్య స్థితి, దీర్ఘకాలంపాటు అనేక ఇతర వ్యాధులతో బాధపడటం తదితర అంశాలు హిస్టీరియాకు కారణమవుతాయి.

 

అలాగే మద్యపానం, అతి సుఖవంతమైన జీవన విధానం, క్షయ, గౌట్‌ వ్యాధుల వలన, ల్యుకోరియా హిస్టీరియాకు కారణమవుతాయి.పిల్లలకు చాలాకాలం తల్లిపాలు పట్టడం, ఎక్కు వమంది పిల్లలను కనడం మొదలైనవి హిస్టీరి యాకు దారి తీయవచ్చు.

 

అదేవిధంగా వంశపారంపర్యంగాకూడా  హిస్టీ రియా సంభవించవచ్చు. సామాజికపరంగా కొన్ని గ్రూపులలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. దీనిని మాస్‌ హిస్టీరియా అంటారు. ఇది ఒక విపరీత మానసిక స్థితి. చాలా వరకూ వెంటనే తగ్గిపోతుంది.

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »