Wednesday, February 20

Download Our App Now

Sankalpa’s Special Article about “Fistula”

ఫిస్టులా అంటే ఏమిటి…..?

మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బి, వాపునకు గురై తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవటాన్ని పైల్స్‌ అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడి కి గురవటం, దీర్గకాలంగా దగ్గు ఉండటం, గర్భధారణ సమయంలో, కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో పైల్స్‌ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపునకు గురవటం వల్ల ఇంటర్నల్‌ పైల్స్‌ ఏర్పడతాయి. మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై, వాటిపైన ఉన్న మ్యూకస్‌ పొర బయటకు పొడుచుకొని రావడాన్ని ఎక్స్టర్నల్ పైల్స్‌ అంటారు. దీనిలో తీవ్రమైన నొప్పితోపాటు రక్తస్రావం ఉండవచ్చు.

ఫిషర్స్‌ : మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను “ఫిషర్‌” అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండి, మల విసర్జన సమయంలో ఒత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు కావటం, గర్భధారణ సమయంలో ఫిషర్‌ ఏర్పడే అవకాశం ఉంది.

ఫిస్టులా : రెండు కణజాలాల మధ్య ఉండే ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. మానవశరీరంలో ఫిస్టులా ఎక్కడైనా ఏర్పడవచ్చు. సర్వసాధారణంగా ఏర్పడేది ఏనల్‌ ఫిస్టులా. ఉబకాయం ఉన్నవారిలో రెండు పిరుదుల మధ్య ప్రాంతంలో మలద్వారం పక్కన ఏర్పడుతుంది. చర్మంపైన చిన్న మొటిమలా ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు,మూడు రోజుల్లో పగిలి చీము కారుతుంది.

నిర్ధారణ పరీక్షలు : సీబీపీ, ఈఎస్సార్‌, ఫిస్టులోగ్రామ్‌, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, కొలోనోస్కోపీ మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సరైన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం, మాంసాహారం తక్కువగా తినడం, మలవిసర్జన ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవటం, సరైన వ్యాయామం చేయడం, ఊబకాయం రాకుండా చూసుకోవటం మేలు.

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »