Wednesday, February 20

Download Our App Now

Sankalpa’s Special Article: Awareness Article about “KIDNEY STONES”

 

మూత్రపిండాలలో రాళ్ళు అంటే ఏమిటి…?

మూత్రపిండాలలో ఏర్పడే గట్టి పదార్ధాలను – మూత్రపిండాలలో రాళ్ళు (కిడ్నీ స్టోన్స్) అని అంటారు. సాధారణంగా ఈ రాళ్ళు మూత్రపిండాల లోపల ఏర్పడతాయి. ఒకటి కన్నా ఎక్కువ రాళ్ళు కూడా ఏర్పడతాయి. మూత్రాశయం, మూత్రనాళాలలో కూడా ఈ రాళ్ళు ఏర్పడతాయి.

సామాన్యంగా 20-30 సం. వయస్సు నుండి ఈ రాళ్ళు ఏర్పడతాయి. ఈ ఆధునిక జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య అధికమౌతున్నది. మన చిత్తూరు జిల్లాలో ఈ సమస్యతో బాధ పడేవాళ్ళు లక్షకి పైగానే ఉన్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ రాళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయి….?

  • అధికశాతం కాల్షియం రాళ్ళు ఏర్పడతాయి.
  • కాల్షియం పదార్ధము – ఇతర ఆక్జలేట్లు ఫాస్పేట్లు, కార్బోనేట్ లవణాలతో కలిసి మూత్రపిండాల రాళ్ళుగా ఏర్పడతాయి.

అసలు ఈ రాళ్ళు ఎలా ఏర్పడతాయి….?

  1. రక్తంలో కాల్షియం, ఫాస్పేటు, యూరిక్ యాసిడ్ లవణాలు అధికం కావడం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. అధికంగా వున్న లవణాలు స్పటిక రూపంగా మూత్రపిండాల పొరలలో ఆకారాలు మారుతూ నిలువ ఉంటాయి.
  2. కొన్ని సందర్భాలలో మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షన్ కారణంగా రాళ్ళు ఏర్పడతాయి.
  3. మూత్రపిండాలు, మూత్ర నాళము, మూత్రాశయ భాగములలో ఇసుక రేణువు సైజు మొదలుకొని బత్తాయి పండు సైజు వరకు ఈ రాళ్లు ఏర్పడతాయి. యూరిక్ ఆసిడ్ పురుషులలో అధికంగా ఏర్పడతాయి.

వీటి లక్షణాలు ఏమిటి….?

  • వీపు క్రింది భాగములో తీవ్రమైన నొప్పి మొదలై పొత్తికడుపుకు వ్యాపించి, వృషణాలు, పురుషాంగము లేక స్త్రీ జననేంద్రియం వరకు వ్యాపిస్తుంది. ఈ విధంగా వ్యాప్తి చెందే నొప్పిని ఫాఇన్ టు గ్రాఇన్ (FOIN To GROIN) నొప్పిగా పరిగణిస్తారు
  • వాంతి వచ్చినట్లుగా ఉండడం, వాంతులు కావడం
  • మూత్రపిండాలలో రాళ్ళు ఆయా భాగాలలో కదలకుండా ఉన్నంత కాలము – నొప్పికాని, బాధను కాని కలిగించవు
  • సైజులో ఎంత చిన్నరాయి అయినా మూత్రపిండము నుంచి మూత్రాశయము లోనికి జారుతున్నపుడు, సున్నితమైన పొర దెబ్బ తినడం, మొదలు పెట్టగానే భరించలేని నొప్పి, బాధ కలుగుతుంది
  • వణుకుతో కూడుకున్న జ్వరంతోపాటు వాంతులు
  • మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట ఉంటుంది.
  • మూత్రం రక్తంతో కలిసి వస్తుంది.
  • ఎక్కువ సార్లు మూత్రము పోవాలనిపిస్తుంది.
  • మూత్రం వెళ్ళాలి అంటే భరించరాని నొప్పి వస్తుందన్న భయం.
  • సాధారణ కడుపు నొప్పి నుండి- భరించరాని కండరాలు పిండినట్లుగా నొప్పి వస్తుంది.

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి….?

మంచి నీళ్ళు అధికంగా తీసుకోవాలి. అలా ధారాళంగా నీరు త్రాగితే మూత్రము పలుచబడి, ఉప్పు, ఖనిజ లవణాలు కాన్ సెంట్రేట్ కాకుండా ఉండి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి
రోజుకు సుమారు 2-3 లీటర్ల నీరు త్రాగటం మంచిది. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ త్రాగవలసిన అవసరం ఉంటుంది

  1. పాలు, వెన్న లాంటి డైరీ ఆహార పదార్ధాలలో కాల్షియం అధిక శాతం ఉంటుంది. కాబట్టి, వీలైనంత తక్కువ మోతాదులలో తీసుకోవాలి
  2. కాల్షియం తో కూడిన మందుల వాడకం తగ్గించాలి
  3. విటమినుA అధికంగా వున్న సహజమైన ఆహారాన్ని తీసుకోవాలి
  4. శారీరకంగా చురుకుగా వుండి, రోజు సుమారు ½ గంటలు వ్యాయామం లేదా నడక చేయాలి
  5. మాంసకృత్తులు అధికంగా వున్న మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. యూరిక్ ఆసిడ్, కాల్షియం, ఫాస్ఫరస్ పదార్ధాలు అధికంగా ప్రోటీన్ ఆహారం ద్వారా తయారవుతాయి
  6. విటమిన్C విటమిన్ D మాత్రలు డాక్టరు సలహా ప్రకారమే వేసుకోవాలి. వీటిని అధికంగా తీసుకోవడం వలన కాల్షియం ఆక్జలేటు రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది
  7. మాంసంలోని లివరు, కిడ్నీ, మెదడులలో యూరిక్ ఆసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండ వ్యాధుల వారు ఈ ఆహారం తీసుకోరాదు.

 

ఒకవేళ ఈ రాళ్లు ఏర్పడినట్లైతే ఏ ఏ పరీక్షలు చేస్తారు…..?

  1. అల్ట్రాసౌండు – కడుపు పరీక్షలు
  2. ఐ.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్)
  3. ‘ఎక్స్’ రే కడుపు మూత్రనాళము – మూత్రాశయ భాగాలు (కె.ము.బి)
  4. యమ్.ఆర్.ఐ (MRI) కడుపు/మూత్రపిండాలు
  5. మూత్ర పరీక్షలు

ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం, మూత్ర వ్యవస్ధ పనిచేయుట వ్యత్యాసం కనుగొనవచ్చును. దానికి అనుగుణం గా అనుభవజ్ఞులైన వైద్య బృందం అత్యాధునిక పరికరాలతో సరైన చికిత్స అందిస్తారు.

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »