Wednesday, March 20

Download Our App Now

Sankalpa’s Special Article: How to Avoid Kidney Stones…..?

కిడ్నీ వ్యాధులకు గురవకుండా చేసే సులువైన మార్గాలు.

మూత్రపిండాలు శరీరంలో కీలక అవయవం. రక్తంలోని వ్యర్థపదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుటలో సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని, కిడ్నీ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? మీ కోసం మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం.

1.సరైన ఆహారాన్ని తీసుకోండి:

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు సరైన ఆహారం తిన్నపుడు, రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలు మరియు రక్తపీడన స్థాయిలు ఆరోగ్యకర స్థితిలో ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు మరియు హోల్ గ్రైన్స్ వంటి వాటిని మీ ప్రణాళికలో కలుపుకోండి. వీటితో పాటూ అధిక సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను మరియు అధికంగా ఉప్పు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. 

2. మూత్రాన్ని ఆపుకోవటం

మూత్రం వచ్చినపుడు సంకోచం లేకుండా వెళ్లి మీ పని కానివ్వండి. ఎందుకంటే మూత్రాన్ని ఆపుకోవటం వలన మూత్రనాళంపై ఒత్తిడి ఏర్పడి, రక్తం నుండి వేరు పరచిన వ్యర్థ పదార్థాలు మూత్రాశయంలో ఎక్కువ సమయం పాటూ నిల్వ ఉంటాయి. ఇది మూత్రపిండాల యొక్క వడపోతను ప్రభావితపరుస్తాయి. 

  1. ఆల్కహాల్ మానెయ్యండి.

మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, ముఖ్యంగా మూత్రపిండాలపై. ఈ అలవాటు రక్తపీడనం మరియు కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. కావున ఈరోజే మద్యం త్రాగే అలవాటు మానుకోండి.

4. శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోండి

ప్రతి రోజు నీటిని అధికంగా తాగండి. నీరు ద్వారా మూత్రపిండాలు శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపుతాయి. అంతేకాకుండా, నీరు శరీర రక్తం యొక్క పరిమాణం మరియు నాణ్యతను కాపాడి, తద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

5. రోజు వ్యాయామాలు

వ్యాయామాలు మన ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తాయని మనందరికీ విధితమే. అలాగే మూత్రపిండాలకు కూడా ప్రయోజనకరమే. రోజు వ్యాయామాలను చేయటం వలన రక్త పీడనాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటమే కాకుండా, తీవ్రమైన కిడ్నీ వ్యాధులు కలగకుండా (CKD (chronic kidney disease)) చేస్తాయి.

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »