Wednesday, March 20

Download Our App Now

Sankalpa’s Special Article about FITS

 మూర్ఛ వ్యాధి – అవగాహన

 

మూర్ఛ వ్యాధి అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకుసంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.మూర్ఛ వ్యాధి మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చు. కానీ చాలా సార్లు కారణం ఏమిటో తెలియదు. మూర్ఛ వ్యాధి ఏ తరహావి అన్నది లేదా అవి ఎంత తీవ్రమైనవి అని బయట ఎవరూతెలుసుకోలేరు.

 

మూర్ఛ వ్యాధి ఎవరికి వస్తుంది…?

 

ఒక వ్యక్తిలో మూర్ఛ వ్యాధి ఏ వయస్సులోనైనా రావచ్చు. 0.5 శాతం నుండి 2 శాతం వరకు ప్రజలలో తమ జీవిత కాలంలో మూర్ఛ వ్యాధి వృద్ది అవుతుంది. మన దేశంలో దాదాపు 10 మిలియన్‌ ప్రజలకు ఈ వ్యాధి ఉంది. దీని అర్థం ప్రతి 1000 మందిలో 10 మందికిఉందన్న మాట.

 

మూర్ఛ వ్యాధిని కలిగించేది ఏది…?

 

మెదడులో విద్యుత్‌ కార్యకలాపాల ను ప్రారంభింపచేసే అంశాలకు, దానిని నియంత్రించే అంశాలకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యంఉంది. విద్యుత్‌ కా ర్యకలాపాలను వ్యాపింపచేయడాన్ని పరిమితం చేసే వ్యవస్థలు కూ డాఉంటాయి.

 

మూర్ఛ వచ్చిన సమయంలో ఈ పరిమితులు విచ్చి న్నమవుతాయి. దీంతో పాటు విపరీతమైనవిద్యుత్‌ విడుదలలు సం భవించవచ్చు. ఒక వ్యక్తికి కనీసం ఈ మూర్ఛలలో రెండు వచ్చినప్పుడు దానిని మూర్ఛ వ్యాధి అని అంటారు.

 

వ్యాధి రావడానికి కారణాలు…

 

జ్వరం, పుట్టుకతోవచ్చే లోపాల (కష్టమైన ప్రసూతి) వల్ల మూర్ఛ వ్యాధి రావచ్చు. మెదుడలో లోపాలు లేదామెదడులో కంతులు, ఇన్‌ఫెక్షన్‌లు (మెనింజైటీస్‌), వేడి నీళ్లతో తలంటుకోవడం, మందుల పరస్పర చర్యల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా మద్యపానం, నిద్రలేకపోవడం, ఆకలితోమాడడం, తారుమారు చేసే ఉద్రిక్తత, రుతుక్రమాల సమయాల్లో లోపాల మూలంగా ఈ వ్యాధి వస్తుంది.

 

చికిత్సా సమయంలో ముందు జాగ్రత్తలు…

 

వ్యాధి గురించి డాక్టర్‌కు సవివరంగా సమాచారాన్ని తెలియ జేయాలి.పుట్టుకతో గాయం, తలకు గాయం, నరాల వ్యవస్థ, కుటుం బచరిత్ర గురించి సమాచారాన్ని అందజేయాలి. మూర్ఛ వ్యాధిగల వ్యక్తికి ఒక రకం కన్నఎక్కువ మూర్చలు ఉండవచ్చు. మూర్ఛ వ్యాధి నియంత్రణకు, మూర్ఛలను గుర్తించడం, వైద్యపరమైన చికిత్సలు జరిపించడం ఎంతో ముఖ్యం. డాక్టర్‌ సలహా ప్రకారం మందులు తీసుకోవాలి.

 

మందులను ఇంట్లో పెట్టుకొని నిర్దేశించిన మోతాదుల ప్రకారం వాటిని వాడాలి. ఏ బ్రాండ్‌మందులు బాగా పనిచేస్తాయో అవే మందులను వాడడం మేలు. ఇతర బ్రాండ్ల మందులను వాడకూడదు.మూర్ఛలు వచ్చే సమయాన్ని, ఇతర

పరిశీలనను ఒక డైరీలో ఎప్ప టికప్పుడు రాసుకోవాలి. కనీసం మూడు ఏళ్ల పాటు మూర్ఛలురాకుండా ఉండాలంటే మందులను క్రమం తప్పకుండా తీసు కోవాల్సి ఉంటుంది. డాక్టర్‌ఆమోదంతో వ్యాధిగ్రస్తులు టివి చూడవచ్చు. క్రీడలు, వినోదకార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

 

చెయ్యకూడనివి…

మందుల వాడకంతో ఏర్పడే దుష్ర్పభావాలు లేదా మందును సహించకపోవడం వంటివాటిని వెంటనే డాక్టర్‌కు తెలియజేయాలి. ఉన్నట్లుండి మందులను ఆపివెయ్యకండి. ఇది ఒకనరాల సంబంధిత అత్యవసర పరిస్థితిని, స్టేటస్‌ఎపిలెప్టికస్‌ని తొందరగా తీసుకురావచ్చు. ఏకకాలంలో ఏవైనా ఇతర కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు లేదా ఇతరత్రా మందులను నిలిపివేయడం గానీ తగ్గించడం గానీ చెయ్యకండి.

 

ఇవి నియంత్రించలేని మూర్ఛవ్యాధికి సామాన్య కారణాలు. మరీ కాం తివంతమైన దీపాలకు, బిగ్గరగా ఉండే ధ్వనుల నుండి తప్పించుకోండి. మూర్ఛ వ్యాధిఉంటే ప్రాణ హాని కలిగించని ఉద్యోగాల్లో చేరాలి. సరైన సురక్షిత ఉపకరణాలను ధరించండి.వాహనాలను నడపడం, స్వి మ్మింగ్‌ చేయకూడదు.ఎత్తులకు ఎక్కడం లేదా ఎత్తయిన చోట్ల పని చేయడం మంచిది కాదు. భారీ యంత్రాలతో లేదావిద్యుత్‌ ఉపకర ణాలతో పనిచేసే సమయంలో మూర్ఛ వస్తే హాని కలిగించవచ్చు.

 

మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి…

 

మూర్ఛను ఆపే ప్రయత్నం చెయ్యకండి. మూర్ఛ వచ్చిన సమయంలో బల వంతంగానోట్లోకి ఏమీ కుక్కకండి. తగినంత గాలి ఆడేవిధంగా చూడాలి. వాంతిని మింగకుండాఉండేందుకు పక్కకు తిరగాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధి ఉన్నవారు వైద్యుని సలహా మేరకు అన్నీ పాటించవలసిన అవసరం ఉంటుంది.

 

అపోహ

-మూర్ఛ వ్యాధి సాధారణం కాదు.

 

-మూర్ఛ వ్యాధి అంటువ్యాధి

 

-మూర్ఛ వచ్చిన వ్యక్తిని పట్టుకొని ఉండాలి

 

-మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మూర్ఛ వ్యాధితో పుట్టి ఉండాలి.

 

-మూర్ఛ వ్యాధి తెలివితేటలు లేనివారి చిహ్నం

 

-ఈ రోగులను దేవుడు ఆవహించి ఉంటాడు. వారిని పూజించాలి

 

-మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తి కుటుంబంలో ఉండడం ఒక కళంకం కనుక ఈనిజాన్ని దాచి ఉంచాలి.

 

నిజం

 

 మనదేశంలో ప్రతి 100 మందిలో 10 మందికి మూర్ఛ వ్యాధి ఉంది.

మూర్ఛ వ్యాధి మరే వ్యక్తికి గాలి, ఆహారం, నీరు మరే మార్గం ద్వారా సంక్రమించదు.

 

– వ్యక్తిని నిర్భధించే ప్రయత్నం చేయ్యకండి. ఇది గాయం కలిగించవచ్చు. గట్టి, పదునైనవస్తువులను వేటినీ దగ్గరలో ఉంచకండి.తలకింద ఏమైనా మెత్తని వస్తువుని ఉంచాలి.

 

– ఎవరిలోనైనా గానీ ఏ సమయంలోనైనా మూర్ఛ వ్యాధి వృద్ధి కాగల అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా మొదట పిల్లల్లోనూ, యువకులలో ఇది కనిపిస్తుంది.

 

– మూర్ఛ వ్యాధి ఒక శారీరక స్థితేగానీ ఒక మానసిక వ్యాధిగానీ లేదాలోపంగానీ కాదు. మూర్ఛ వ్యాధి అసాధారణమైన తెలివితేటలు కలిగిన ప్రముఖ వ్యక్తులకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

 

– మూర్ఛవ్యాధికి సంబంధించిన మూర్ఛ వచ్చినప్పుడు రోగులను అదుపులో పెట్టలేని విధంగాప్రవర్తిస్తారు. అయితే ఇది మానవాతీత శక్తికాదు. వారికి వైద్య చికిత్సలు జరిపించి అందరిలాగే చూడాలి.

 

– దురదృష్టవశాత్తు మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తులు, కుటుంబాల పట్ల చిన్నచూపుచూస్తారు. ఇది సరైనది కాదు.

 

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »