Friday, April 26

Download Our App Now

FULL INFORMATION ABOUT OUR “LIVER”

మన లివర్ గురించిన పూర్తి అవగాహన

కాలేయమునకు సంబంధించిన వ్యాధుల మూలంగా మెదడు క్షీణించే స్థితి (హెపాటిక్ ఎన్సిఫేలోపథీ)

హెపాటిక్ ఎన్సిఫేలోపథీ(పోర్టల్-సిస్టమేటిక్ ఎన్సిఫేలోపథీ, లివర్ ఎన్సిఫేలోపథీ, హెపాటిక్ కోమా) వ్యాధిలో మెదడు యొక్క పనితీరు క్షీణిస్తూ పోతుంది. దీనికి కారణం సాధారణంగా కాలేయం ద్వారా నిర్మూలించబడే విష పదార్థాలు కాలేయంలో పేరుకొనిపోయి రక్తప్రసరణద్వారా మెదడుకు చేరి, మెదడు క్షీణించడానికి కారణమవుతాయి.

  • మధుపానం, మందు లేదా దీర్ఘకాలికంగా కాలేయ జబ్బుతో బాధ పడుతున్నవారిలో మానసిక శారీరక ఒత్తిడి వంటి ప్రేరేపిత కారణాల మూలంగా మెదడు క్షీణించే పరిస్థితి ఏర్పడవచ్చు.
  • స్వభావం, ప్రవర్తన మరియు మానసిక స్థితిలో మార్పులతో రోగులు అయోమయంగా మరియు మత్తుగా ఉంటారు
  • శారీరక పరీక్ష, ఎలక్ట్రోఎన్సిఫేలోగ్రఫీ మరియు రక్త పరీక్షల ఫలితాలతో వైద్యులు ఈ స్థితిని నిర్ధారిస్తారు.
  • ప్రేరేపిత కారణాలను తొలగించడం మరియు ఆహారంలోమాంసకృత్తులను తగ్గించడం ద్వారా ఈ లక్షణాలను రాకుండా కాపాడుకొనవచ్చును.

ప్రేగుల నుండి రక్తప్రసరణలోకి పీల్చబడ్డ పదార్థాలు కాలేయం గుండా వెళతాయి. కాలేయంలో సాధారణంగా వీటిలోని విష పదార్థాలు తీసివేయబడతాయి. చాలావరకు ఈ విష పదార్థాలు మాంస కృత్తుల జీర్ణప్రక్రియలో అవి విచ్ఛిన్నమయినపుడు సాధారణంగా ఏర్పడినవే. హెపాటిక్ ఎన్సిఫేలోపథీలో విష పదార్థాలు నిర్మూలించబడవు. దీనికి కారణం కాలేయం పని తీరు బలహీనపడి ఉండడమే. కాలేయం వ్యాధి కారణంగా, కాలేయానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రవేశ సిరల వ్యవస్థ మరియు సాధారణ లేదా దైహిక వ్యవస్థకు మధ్య ఏర్పడ్డ సిరల ద్వారా ఈ విష పదార్థాలు కాలేయమును చేరకుండానే రక్తప్రసరణలోనికి చేరిపోతాయి. కారణం ఏదైనా, పర్యవసానం ఒకటే. విష పదార్థాలు మెదడు కు చేరి దాని పనితీరును ప్రభావితం చేస్తాయి. మెదడుకు ఏ పదార్థాలు విషపూరితములో ఖచ్ఛితంగా తెలియదు. అమ్మోనియా వంటి రక్తంలోని మాంసకృతుల విచ్ఛిన్న పదార్థాలు, ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

 

దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న వారిలో, మెదడు క్షీణించే స్థితి సాధారణం. తీవ్రమైన ఇన్ఫెక్షన్ మరియు ఆల్కహాల్ కాలేయానికి అధికంగా హాని కలిగిస్తాయి. లేదా అధికంగా మాంసకృత్తులు ఆహారములో తీసుకొనడం మూలంగా రక్తంలో వీటి అంత్య ఉత్పత్తులు అధికమయి మెదడు క్షీణస్థితికి కారణమవుతాయి. అన్నవాహికలో ఉబ్బిన, మెలిపడిన సిరల నుండి రక్తస్రావం జరగడం వంటి జీర్ణవ్యవస్థలో రక్తస్రావం మూలంగా కూడా రక్త ప్రవాహంలో మాంసకృత్తుల అంత్య ఉత్పత్తులు అధిక మయి మెదడుపై నేరుగా ప్రభావం చూపే అవకాశం వుంటుంది. నిర్జలీకరణ, రక్తంలో లవణాల అసమతుల్యత, కొన్ని మందులు ఉదాహరణకి ఉపశమన మందులు, మత్తు కలిగించే మందులు, మూత్రవిసర్జన అధికం చేసేవి కూడా మెదడు క్షీణస్థితిని ప్రేరేపించవచ్చు. కాబట్టి, ప్రేరేపిత కారణాన్ని నిర్మూలిస్తే మెదడు క్షీణదశను నివారించవచ్చును. రోగి తీసుకునే ఆహారంలో మాంసకృతులను తగ్గించడం వలన మెదడు క్షీణించే లక్షణాలను తగ్గించడానికి దోహదపడి, నిర్మూలించవచ్చును.

లక్షణములు మరియు నిర్ధారణ:

లక్షణాలలో ముఖ్యంగా తగ్గిన అప్రమత్తత, అయోమయ స్థితి మరియు క్షీణించిన మెదడు పనితీరు ఉంటాయి. ప్రారంభ దశలలో, యుక్తిగా ఆలొచించలేకపోవడం, స్వభావం మరియు ప్రవర్తనలో మార్పులు కనబడతాయి. రోగి యొక్క మానసిక స్థితి మారవచ్చు మరియు వివేకం క్షీణించవచ్చు. సాధారణ నిద్రతీరు దెబ్బతినడం జరుగవచ్చు. మెదడు క్షీణస్థితి ఏదశలో ఉన్నా, రోగి యొక్క శ్వాసలో ఒక విధమైన తీపి వాసన వస్తూ ఉంటుంది. జబ్బు ముదురుతూ ఉండగా, రోగి చేతులు చాచినప్పుడు అవి స్థిరంగా ఉండక టపటపా (ఏస్టెరిక్సిస్) కొట్టుకుంటాయి. అంతేకాకుండా, రోగి నిద్రమత్తుగా మరియు అయోమయంగా ఉంటూ, కదలికలు, మాటలు మందకొడిగా ఉంటాయి. స్థితి నిర్ధారణ రాహిత్యము సాధారణంగా కనబడుతుంది. అసాధారణంగా మెదడు క్షీణ స్థితిలో ఉన్న రోగి కలవరపడినట్టుగా, ఉద్రేకపడుతున్నట్టుగా చేస్తారు. మూర్ఛలు కూడా అసాధారణము. క్రమక్రమంగా రోగి స్మారక స్థితి నుంచి అపస్మారకస్థితికి జారిపోతాడు.

ప్రారంభ దశలో మెదడు క్షీణస్థితిని నిర్ధారించడానికి ఒక ఎలెక్ట్రో ఎన్సెఫేలోగ్రామ్ (ఇ ఇ జి) (మెదడు, వెన్నుపాము మరియు నరాల జబ్బుల నిర్ధారణ: ఎలెక్ట్రో ఎన్సెఫేలోగ్రఫీ) దోహద పడవచ్చు. తీవ్రత తక్కువ ఉన్న కేసులలో, ఒక ఇ ఇ జి మెదడు తరంగాలు అసాధారణంగా తగ్గినట్టు, రక్త పరీక్షలు మామూలుగా అమ్మోనియా శాతం అసాధారణంగా ఎక్కువ స్థాయిల్ని చూపిస్తాయి. కాని, ఎన్సిఫేలోపథీని నిర్ధారించడానికి, ఎప్పుడూ స్థాయిలను కొలవడం విశ్వసనీయమైన మార్గం కాదు.

చికిత్స

సక్రమితం లేదా ఒక మందు వంటి ఎన్సిఫేలోపథీ కలుగచేసే ప్రేరేపిత కారణాలకోసం వైద్యుడు చూసి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాడు. మామూలుగా, వ్యక్తి తీసుకునే పథ్యాన్ని నియంత్రించడం ద్వారా ప్రేగుల నుండి వెలువడుతున్న విష పదార్థాలను నిర్మూలించడానికి కూడా వైద్యుడు ప్రయత్నం చేస్తాడు. ఆహారంలో మాంసకృత్తులను తగ్గించి తద్వారా రక్తప్రసరణలో మోతాదు నియత్రించడానికి ప్రయత్నం చేస్తారు. పథ్యంలో మాంసకృత్తులను తగ్గించడం లేదా నిర్మూలించడం మరియు పిండి పదార్థాలను నోటితో లేదా సిరల గుండా ఇవ్వడం వంటివి కేలరీల యొక్క ముఖ్యమైన మూల శక్తి. ఆ తరువాత, మెదడు క్షీణస్థితి మరింత దిగజారకుండా తగినంత మాంసకృతులను ఇవ్వడానికి, జంతువుల ద్వారావచ్చే మాంసకృతుల కన్నా కూరగాయల ద్వారా లభించే మాంసకృత్తుల మోతాదును పెంచి (ఉదా; సోయామాంసకృత్తులు), వైద్యుడు ఇవ్వవచ్చును. పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు పథ్యం ఎక్కువ ఉంటే తీసుకోవడం మూలంగా ప్రేగుల ద్వారా ఆహారం త్వరగా ప్రసరించి, ప్రేగులలో ఆమ్లతత్వం మారి, తద్వారా అమ్మోనియా యొక్క చూషణం కూడా తగ్గిపోతుంది. ల్యాక్టులోజ్ అనే కృత్రిమ చక్కెర నోటి ద్వారా సేవించడం మూలంగా ఈ విధమైన లాభం పొందవచ్చును. ఇది ప్రేగులలోని ఆమ్లతను మార్చి విరేచనకారిగా పనిచేసి ఆహారం త్వరిత గతితో ప్రేగులలో ప్రసరించేలా చేస్తుంది. మలద్వారం ద్వారా విరేచనకారిని పంపి శుభ్రపరచవచ్చును. అప్పుడప్పుడు, ల్యాక్టులోజ్ అనే చక్కెర పదార్థం సహించని వ్యక్తికి, నోటి ద్వారా సూక్షక్రిమినాశక మందులు ఇవ్వవలసి ఉంటుంది .

 

చికిత్సతో, మెదడు క్షీణస్థితిని పూర్వ సాధారణ స్థితికి తరచుగా తీసుకుని రావచ్చును. నిజానికి, ముఖ్యంగా పూర్వ సాధారణ స్థితికి రాగల కారణం చేత మెదడు క్షీణస్థితి ప్రేరేపించబడినట్లైతే, పూర్తి స్వస్థత సాధ్యమే. అయినప్పటికినీ, దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నవారిలో మాత్రం భవిష్యత్తులో మళ్ళీ ఈ ఎన్సిఫేలోపథీ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. తీవ్రంగా కాలేయం ఉబ్బడం వలన 80 శాతం వరకు రోగులలో, అపస్మారక స్థితిలోనికి వెళతారు. వీరికి విస్తృతమైన చికిత్స చేసినప్పటికీ ప్రాణపాయపరిస్థితి ఏర్పడుతుంది.

 

  • డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »