Tuesday, March 19

Download Our App Now

Doctors Day Celebrations by Indian Medical Association (IMA) Tirupati Branch

*ఘనంగా డాక్టర్ల దినోత్సవం.*

Indian Medical Association (IMA) తిరుపతి శాఖ ఆద్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం (Doctors Day) స్తానిక బ్లిస్ హోటల్ నందు ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి IMA ప్రెసిడెంట్ Dr.I.V.Ramachandra Rao మరియు సెక్రటరి Dr.A.R.Reddy , కోశాధికారి Dr.Yugandhar మరియు నగరంలోని ప్రముఖ వైద్యులు Dr.G.Subramanyam గుండె వైద్య నిపుణులు, Dr.C.Subramanyam, రష్ హాస్పిటల్ అధినేత, Dr.Srihari సెవెన్ హిల్ల్స్ హాస్పిటల్ అధినేత ఇంకా బి సి రాయ్ అవార్డు గ్రహీత Dr.Rayapu Ramesh Babu , ప్రముఖ వైద్యులు ఆషాలత దంపతులు మరియు నగరంలోని ఇతర ప్రముఖ వైద్యులు అంతేకాకుండా పుత్తూరు , శ్రీకాళహస్తి, పీలేరు తదితర ప్రాంతాలనుంచి కూడా సుమారు 200 మంది కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం జ్యొతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించారు. అనంతరం Dr.B.C.Roy గారికి నివాళి అర్పించి శ్రద్దాంజలి ఘటించారు.

Doctors Day సందర్భంగా రాబోయే సంవత్సరంలో Trust Doctors (డాక్టర్లను నమ్మండి)  అనే నినాదంతో ముందుకెల్లాలని, వైద్యులను భగవంతుని ప్రతి రూపాలుగా ప్రజలు భావిస్తారని, అందుకు అనుగునంగా డాక్టర్లు ఎంతో నమ్మకంతో రోగులకు సేవలు చేయాలని, వైద్యులు ఎప్పుడూ తెలిసి ఎవ్వరి చావుకు కారణం కారని, ఏదైనా అనుకోని ప్రతికూల పరిస్తితులలో మాత్రమే మరణం సంభవిస్తుందని తెలిపారు. 

ఈ సంధర్భంగా వైద్యసేవలలో విషేష ప్రతిభ కనబరిచిన వైద్యులు అయిన స్తానిక Maternity Hospital Superintendent Dr.Bhavani , పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ Dr.Raviraju ఇరువురిని ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియడారు. 

Doctors Day సందర్భంగా ఒక నెల పాటు సభ్యత్వ రుసుము మరియు Welfare Schemes అన్ని కూడా రుసుములు సగానికి తగ్గించినట్టు తెలిపారు.

IMA సభ్యులంతా ఈ అవకాసాన్ని వినియోగించులోవాలని తెలియచేసారు.

అనంతరం సాంస్క్రుతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి, అందులో వైద్యులు మరియు వారి పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

*అంతకుముందు Doctors Day సందర్భంగా మరియు IMA సెక్రటరీ Dr.A.R.Reddy  పుట్టిన రోజు పురస్కరించుకొని స్తానిక Swetha Multi Speciality Hospital నందు వేడుకలు నిర్వహించారు.* 

*ఈ సంధర్భంగా స్థానిక  ఆటో డ్రైవర్లకు 100 మందికి ఉచితంగా Uniform (ఏకరూప దుస్తులు) పంపిణీ చేసారు. అనంతరం అన్నదానం కార్యక్రమము జరిగింది.*

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »