Wednesday, March 20

Download Our App Now

ఏపీ పోస్టల్ సర్కిల్‌లో 36 ఉద్యోగాలు 4/1/18

ఏపీ పోస్టల్ సర్కిల్‌లో 36 ఉద్యోగాలు 

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా కింద 36 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: పోస్టల్ అసిస్టెంట్-6; సార్టింగ్ అసిస్టెంట్-1; పోస్టల్ అసిస్టెంట్ (సీవో/ఆర్‌వో)-1; పోస్ట్‌మ్యాన్-17; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-11.
 
క్రీడాంశాల వారీ ఖాళీలు:    కబడీ(పురుషులు)-5;
                                                     అథ్లెటిక్స్ (పురుషులు)-5;
                                                    టేబుల్ టెన్నిస్-4 (పురుషులు-3+మహిళలు-1);
                                                    క్రికెట్ (పురుషులు)-7; వాలీబాల్ (పురుషులు)-6;
                                                     వెయిట్ లిఫ్టింగ్-4;
                                                     పవర్ లిఫ్టింగ్-4;
                                                     క్యారమ్స్ (మహిళలు)-1.
వేతనం: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ (సీవో/ఆర్‌వో) పోస్టులకు రూ.25,500;
                 పోస్ట్‌మ్యాన్-రూ.21,700;
                ఎంటీఎస్‌కు రూ.18,000.
 
అర్హతలు: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ (సీవో/ఆర్‌వో) పోస్టులకు ఇంటర్మీడియెట్; పోస్ట్‌మ్యాన్‌కు పదోతరగతి; ఎంటీఎస్‌కు పదోతరగతి/ఐటీఐ ఉత్తీర్ణత. అలాగే సంబంధిత పోస్టులను అనుసరించి ఏదైనా క్రీడాంశంలో అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర/అంతర్రాష్ట్ర/యూనివర్సిటీ/స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్‌లో ప్రాతినిథ్యం/పతకం పొంది ఉండాలి. 
వయసు: 2018, జనవరి 30 నాటికి ఎంటీఎస్ పోస్టులకు 18-25 ఏళ్ల లోపు; మిగిలిన పోస్టులకు 18-27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
ఎంపిక: అకడమిక్ మార్కులు, క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు రుసుం: రూ.100. 
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పత్రం డౌన్‌లోడ్ చేసుకొని అందులో వివరాలు నింపాలి. దానికి సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి, ఫొటోలు తదితర అవసరమైన వాటిని జతచేసి కవరులో ఉంచి ‘ది చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (రిక్రూట్‌మెంట్ సెక్షన్), ఆంధ్రప్రదేశ్ సర్కిల్, కృష్ణలంక, విజయవాడ-520013, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి. 
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: జనవరి 30, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.indiapost.gov.inwww.appost.in

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »