Monday, February 18

Download Our App Now

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్‌లో 80 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ 28/12/17

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్‌లో 80 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్).. 2018-19 సంవత్సరానికి గాను 80 జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు-ఖాళీలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)-80

వ్యవధి: రెండేళ్లు

ఫెలోషిప్: రూ.17,600. దీంతోపాటు ఏడాదికి కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.16,500 ఇస్తారు.

అర్హతలు: హిస్టరీ/హిస్టరీ అనుబంధ సబ్జెక్టుల్లో ఏదైనా యూనివర్సిటీలో పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అర్హులు.

ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ టెస్ట్).

ప్రవేశ పరీక్ష విధానం: ఇందులో ఎ, బి, సి అనే మూడు విభాగాలు ఉంటాయి. ‘ఎ’ విభాగం నుంచి 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 30. ‘బి’ విభాగం నుంచి 12 షార్ట్ ఎస్సే ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఏవైనా 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున ఈ విభాగం గరిష్ట మార్కులు 30. ‘సి’ విభాగం నుంచి 6 లాంగ్ ఎస్సే ప్రశ్నలు ఇస్తారు. వీటిలో నుంచి ఏవైనా రెండు ప్రశ్నలు ఎంచుకొని ఒక్కోదానికి 500 పదాలకు తగ్గకుండా సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 20 మార్కుల చొప్పున ఈ విభాగం గరిష్ట మార్కులు 40. మొత్తం పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ, బెంగళూరు, గువాహటి, పుణె.

దరఖాస్తు రుసుం: రూ.200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీలకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్‌కాపీ ప్రింటవుట్‌కు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు, ఫొటోలు తదితర అవసరమైన వాటిని జతచేసి ‘మెంబర్ సెక్రటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారిక్ రీసెర్చ్, నెం.35, ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ-110001’ చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 14, 2018.

దరఖాస్తు హార్డ్‌కాపీ చేరడానికి చివరి తేదీ: జనవరి 24, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ichr.ac.in

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »